బాలయ్య సరసన ఆర్ ఎక్స్ 100 భామ


Payal rajput romance with balakrishna in NTR biopic

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ . రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాట్ భామ ఆర్ ఎక్స్ 100 చిత్ర హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది . జయసుధ పాత్రలో పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది . ఎన్టీఆర్జయసుధ ల కాంబినేషన్ లో పలు హిట్ చిత్రాలు రాగా డ్రైవర్ రాముడు చిత్రంని ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎంచుకున్నారు . ఈ సినిమాలో పలు సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి దాంతో బాలయ్య – పాయల్ రాజ్ పుత్ లపై ఈ పాట చిత్రీకరించనున్నారు. బాలయ్య ఎన్టీఆర్ గా హాట్ భామ పాయల్ జయసుధగా అలరించనున్నారు .

ఇప్పటికే ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్ లు గెస్ట్ పాత్రల్లో నటించడానికి అంగీకరించడమే కాకుండా నటించారు కూడా . విద్యాబాలన్ , రకుల్ ప్రీత్ సింగ్ , నిత్యామీనన్ , తమన్నా లు నటించగా తాజాగా ఆ లిస్ట్ లోకి ఇప్పుడు పాయల్ వచ్చి చేరింది . ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు 2019 జనవరి 9 న విడుదల కానుంది . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు .

English Title: Payal rajput romance with balakrishna in NTR biopic