ఐటెం సాంగ్ చేసిన పాయల్ కు ఛాన్స్ ఇవ్వనున్న తేజ

Payal Rajput
ఐటెం సాంగ్ చేసిన పాయల్ కు ఛాన్స్ ఇవ్వనున్న తేజ

దర్శకుడు తేజ తెరకెక్కించిన సీత చిత్రాల్లో బులెట్ మీదొచ్చే బుల్రెడ్డి అనే ఐటెం సాంగ్ లో నర్తించింది హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. నిజానికి ఆమె అరంగేట్రమే ఒక సంచలనం. ఆరెక్స్ 100 చిత్రంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా అమ్మడికి అవకాశాలు బానే వచ్చాయి. వరసగా రవితేజ సరసన డిస్కో రాజాలో, వెంకటేష్ సరసన వెంకీ మామలో అవకాశాలు కొట్టేసింది.

అంతేనా ఆర్డీఎక్స్ లవ్ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో అటు ఫైటింగులు చేసేసింది, ఇటు ఎక్స్పోజింగ్ లో కూడా దుమ్ము లేపింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తేజ ఒక లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ అనుకుంటున్నాడట. అందులో హీరోయిన్ గా తనకు ఐటెం సాంగ్ చేసి పెట్టిన పాయల్ నే తీసుకుంటున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తేజ సినిమా అంటే కచ్చితంగా నటనకు స్కోప్ ఉన్న పాత్ర వస్తుంది. ఈ రకంగా అమ్మడికి ఇది మంచి ప్రాజెక్ట్ అనే చెప్పాలి.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు అన్నీ విడుదలైతే హీరోయిన్ గా తన రేంజ్ పెరుగుతుందని ఆశపడుతోంది పాయల్.