పాయల్ రాజ్పుత్ ప్రేమలో పడిందా?


payal rajputh matter
payal rajputh matter

చిన్న చిత్రాల్లోనే ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం 50కోట్లు కలెక్ట్ చేసి ట్రెండ్ సెట్ చేసింది.. ఆ చిత్రంలో నటించిన  పాయల్‌ రాజ్‌పుత్‌ చాలా బోల్డ్ గా నటించి యూత్ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఈ మధ్య పాయల్ తన బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ వున్నా ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.. వాళ్లిద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది..  సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్‌ ఈ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఫొటోకు మూడు ప్రేమ గుర్తులను జత చేశారు. దాంతో నెటిజన్లు ఆమె ప్రియుడై ఉంటాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అదీకాకుండా కామెంట్స్‌ ఎక్కువగా కనిపించకుండా పాయల్‌ కొన్ని బ్లాక్‌ చేసేశారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు సౌరభ్. పలు పంజాబీ ధారావాహికల్లో వీరిద్దరూ కలిసి నటించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఒకర్నొకరు ఇష్టపడినట్లు సమాచారం. మరి ఈ విషయంపై పాయల్‌ స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ప్రస్తుతం ఆమె ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె వెంకటేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. దీంతో పాటు ‘ఆర్‌డీఎక్స్‌’, రవితేజకు జోడీగా ‘డిస్కో రాజా’ చిత్రాల్లో నటిస్తున్నారు.. ఈ అందాలభామ!