క‌రోనా టెస్ట్ చేయించుకున్న పాయ‌ల్‌!

క‌రోనా టెస్ట్ చేయించుకున్న పాయ‌ల్‌!
క‌రోనా టెస్ట్ చేయించుకున్న పాయ‌ల్‌!

క‌రోనా సెకండ్ వేవ్ వ‌ణికిస్తోంది. దేశ వ్యాప్తంగా దీని ప్ర‌భావం తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. బాలీవుడ్‌కు చెందిన చాలా మంది స్టార్స్ తాజాగా కోవిడ్ బారిన ప‌డుతున్నారు. దీంతో సెల‌బ్రిటీల్లో భ‌యం మొద‌లైంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా.. కోవిడ్ ప్ర‌మాణాలు పాటిస్తున్నా వైర‌స్ మాత్రం విడిచి పెట్ట‌డం లేదు.

దీంతో చాలా మంది సెల‌బ్రిటీలు క‌రోనా బారినే ప‌డుతున్నారు. ఇటీవ‌ల ముంబైకి చెందిన బాలీవుడ్ న‌టీన‌టులు అత్య‌ధిక శాతం క‌రోనా బారిన ప‌డ్డారు. ఇప్ప‌టికే చాలా మంది క్వారెంటైన్‌కి వెళ్లిపోయారు. డాక్ల‌ర్లు సూచించిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ మెడిసిన్ వాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ తార‌లు కూడా ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఈ సంద‌ర్భంగా హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ కోవిడ్ టెస్టులు చేయించుకుంది. ఓ మూవీ షూటింగ్ లో పాల్గొన‌డానికి రెడీ అయిన పాయ‌ల్ అందు కోసం కోవిడ్ టెస్టు చేయించుకుంది. ఇందుకు స‌పంబంధించిన వీడియోని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాన‌ని, ఇప్పుడు నా కొత్త ప్రాజెక్ట్ కోసం టెస్ట్ చేయించుకున్నాని, రిజ‌ల్ట్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని వెల్ల‌డించింది.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)