నిఖిల్ తో పెళ్లి చూపులు డైరెక్టర్


pelli choopulu director next movie with hero nikhil

వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ తన తదుపరి చిత్రాన్ని పెళ్లి చూపులు డైరెక్టర్ తో చేయనున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం కిర్రాక్ పార్టీ చిత్రంలో నటిస్తున్న నిఖిల్ ఆ చిత్రం రిలీజ్ కి సిద్ధం కావడంతో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు . పెళ్లి చూపులు చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దాస్యం తరుణ్ భాస్కర్ తన రెండో చిత్రాన్ని ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేస్తున్నాడు . ఆ సినిమాని వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

 

రెండో సినిమా కంప్లీట్ కాకముందే మూడో సినిమాకు సన్నాహాలు ప్రారంభించాడు తరుణ్ భాస్కర్ , నిఖిల్ ని కలిసి ఓ కథ చెప్పడం అది నిఖిల్ కు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచాడట ! ఇంకేముంది ఈ ఏడాది లోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది . నిఖిల్ – దాస్యం తరుణ్ భాస్కర్ ల కాంబినేషన్ అంటే ఎంతో కొంత క్రేజ్ ఏర్పడటం సహజమే కదా !