మూడో చిత్రానికి రెడీ అవుతున్న పెళ్లిచూపులు డైరెక్టర్


Tharun Bhascker Dhaassyam
Tharun Bhascker Dhaassyam

పెళ్లిచూపులు చిత్రంతో ప్రభంజనం సృష్టించిన దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ ముచ్చటగా మూడో చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు . పెళ్లిచూపులు తర్వాత ఈ నగరానికి ఏమైంది అన్న చిత్రం చేసాడు . ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ డిజాస్టర్ అయితే కాదు . దాంతో కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు దాస్యం తరుణ్ భాస్కర్ . ఇక ఈ మూడో చిత్రాన్ని కూడా దాదాపుగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది అని తెలుస్తోంది ఎందుకంటే సురేష్ బ్యానర్ లోనే మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు ఈ దర్శకుడు .

తెలుగునాట కొంతమందికి రెండో చిత్రం అచ్చిరాలేదు అలాగే ఈ పెళ్లిచూపులు డైరెక్టర్ కు కూడా దెబ్బ చూపించింది దాంతో కసితో మూడో సినిమాకు రెడీ అయ్యాడు . ఇక త్వరలోనే అధికారికంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కానుందని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు . అంటే ఒకటి రెండు రోజుల్లోనే వెంకటేష్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రావచ్చు .

 

View this post on Instagram

 

Next announcement, coming soon ! Super nervous and excited. 🤞

A post shared by Tharun Bhascker (@tharunbhascker) on