`ఆర్ఆర్ఆర్‌` హ‌క్కులు పెన్ ఇండియా సొంతం!

Pen india acquires all rights of rrr
Pen india acquires all rights of rrr

ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మరియు పంపిణీ సంస్థ పెన్ ఇండియా రాజమౌలి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అన్ని భాష‌ల‌కు సంబంధించిన డిజిటల్ అండ్ శాలిలైట్  హక్కులను రికార్డు స్థాయి మొత్తానికి కొనుగోలు చేసింది. ఇదే విష‌యాన్నిఅధికారికంగా వెల్ల‌డించింది. అంతే కాకుండా పెన్ ఇండియా ఈ మూవీ హిందీ వెర్షన్ థియేట్రికల్ హక్కులను కూడా సొంతం చేసుకున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది.

గ‌త రెండు రోజులుగా ఒప్పందానికి సంబంధించిన చ‌ర్చ‌లు జరుగుతున్నాయ‌ని వార్త‌లు షికారు చేశాయి. అయితే ఆ వార్త‌ల్ని నిజం చేస్తూ డీల్ ఫినిష్ కావ‌డ్ంతో స్వ‌యంగా పెన్ ఇండియా సంస్థ అధికారికంగా ట్విట్టర్ వేదిక‌గా వెల్ల‌డించింది. నార్త్ ఇండియాలో ఈ చిత్రాన్ని డిస్ట్రీబ్యూట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

తాజా ఒప్పందం వ‌ల్ల నిర్మాత డీవీవీ దానయ్య, ద‌ర్శ‌కుడు రాజమౌళి భారీ లాభాలను ద‌క్కించుకోనున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కొమ‌రం భీం పాత్ర‌లో  ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చరణ్, కీల‌క పాత్ర‌లో అజయ్ దేవ్‌గన్, సీత‌గా అలియా భట్, ఇక ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో ఒలివియా మోరిస్, రే స్టీవెన్‌స‌న్‌, అలీస‌న్ డూడీ, స‌ముద్ర‌ఖ‌ని న‌టిస్తున్నారు.