`శ్రీ‌కారం` కోసం పెంచ‌ల్ దాస్ మాస్ సాంగ్‌!

`శ్రీ‌కారం` కోసం పెంచ‌ల్ దాస్ మాస్ సాంగ్‌!
`శ్రీ‌కారం` కోసం పెంచ‌ల్ దాస్ మాస్ సాంగ్‌!

పెంచల్ దాస్ పాడిన `దారి చూడు దుమ్మూ చూడు మామ‌..` మాస్ పాట పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. మాస్‌లో ఈ పాట ఓ రేంజ్‌లో ఊపేసింది. రాయలసీమ యాసలో పాటలు రాయడం, పాడటం పెంచల్ దాస్ ప్ర‌త్యేక‌త‌. విల‌క్ష‌ణ శైలిలో రాయ‌ల‌సీమ ప‌ల్లె పదాల‌కు వ‌న్నె తీసుకొస్తున్నారాయ‌న‌. తాజాగా ఆయ‌న పుంచి మరో మాస్ పాట వ‌చ్చేసింది.

శర్వానంద్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `శ్రీకారం`. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై లో రామ్ అచంట‌, గోప్‌చంద్ అచంట‌ నిర్మిస్తున్నారు. ఏడు నెల‌ల విరామం త‌రువాత ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే తిరుప‌తిలో మొద‌లైంది. ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కిషోర్ బి ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ మూవీ కోసం పెంచ‌ల దాస్ సాహిత్యం అందించి పాడిన పాట `భ‌లేగుంది బాలా..`. ఈ సాంగ్ ప్రోమోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట‌కు మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం అందించారు. మాస్ బీట్‌గా ఈ పాట ఆక‌ట్టుకునేలా క‌నిపిస్తోంది. ఫుల్ సాంగ్ ని ఈ నెల 9న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ  మాస్ పాట‌లో హీరో శ‌ర్వానంద్ లుంగీ ధ‌రించి క‌నిపిస్తే హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహ‌న్ లంగా ఓణీలో హోయ‌లు పోయింది. థియేట‌ర్లో ఈ పాట ఓ రేంజ్‌లో ఊపేలా క‌నిపిస్తోంది. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ రైతుగా క‌నిపిస్తుఏన్న విష‌యం తెలిసిందే.