ఆకట్టుకున్న పెంగ్విన్ టీజర్ – ఒక అమ్మ కథ


ఆకట్టుకున్న పెంగ్విన్ టీజర్ - ఒక అమ్మ కథ
ఆకట్టుకున్న పెంగ్విన్ టీజర్ – ఒక అమ్మ కథ

తమిళంలో విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కార్తీక్ సుబ్బరాజ్, నేషనల్ అవార్డును గెలుచుకున్నాడు కూడా. తన మొదటి సినిమాతోనే అందరినీ ఆకర్షించిన ఈ యువ దర్శకుడు ఇప్పుడు నిర్మాతగా సరికొత్త అవతారం ఎత్తాడు. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా మహానటి ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం పెంగ్విన్. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇప్పుడు విడుదలైంది.

ఈ సినిమా టీజర్ మొదట ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ తో మొదలైంది. అమ్మ మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలిపే వ్యాఖ్యలువచ్చాయి. అలాగే కీర్తి సురేష్ ఎవరి గురించో వెతుకుతుండడం వంటి షాట్స్ ఉన్నాయి. అయితే సడెన్ గా ఈ చిత్రంలో మెయిన్ పాయింట్ ను దర్శకుడు రివీల్ చేసాడు. చార్లీ చాప్లిన్ గెటప్ లో ఉన్న వ్యక్తి కత్తితో నరుకుతూ ఉండడాన్ని చాలా ఎఫెక్టివ్ గా చూపించాడు దర్శకుడు. ఈ టీజర్ లో మొదటగా ఆకట్టుకునేది ఆహ్లాదకరమైన విజువల్స్, ఒళ్ళు గగుర్పొడిచే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. మొత్తంగా పెంగ్విన్ టీజర్ తో ఆకట్టుకుంది. జూన్ 11న ఈ చిత్ర ట్రైలర్ ను, 19న ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలవుతుంది. ఈశ్వర్ కార్తిక్ ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూద్దాం.