అనుకున్నట్టే జరుగుతుంది విజయశాంతి గారి విషయంలో

అనుకున్నట్టే జరుగుతుంది విజయశాంతి గారి విషయంలో
అనుకున్నట్టే జరుగుతుంది విజయశాంతి గారి విషయంలో

వరుస 4 సినిమాల విజయం తర్వాత దర్శకులు ‘అనిల్ రావిపూడి’ గారి 5 వ సినిమా 2020 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 న లేదా 12 న విడుదల అవ్వబోతుంది. ఆ సినిమా పేరు ‘సరిలేరు నీకెవ్వరూ’. సూపర్ స్టార్ ప్రిన్స్ ”మహేష్ మహేష్” గారు కథా నాయకులు. మహేష్ బాబు గారి కెరీర్ లో 26 వ సినిమాగా తెరకెక్కబోతుంది సరిలేరు నీకెవ్వరూ సినిమా. అనిల్ రావిపూడి – మహేష్ బాబు గారి మొదటి కలయికలో రానున్న ఈ సినిమా మీద ప్రజలందరికి ఆసక్తికరంగానే ఉంది.

ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ ఒకప్పటి ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా కథా నాయిక ‘విజయ శాంతి’ గారు ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. మహేష్ బాబు – విజయశాంతి గారి కలయికలో ఇదివరకు 2,3 సినిమాలు వచ్చాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి ఈ సినిమాకి పని చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరూ సినిమాకి నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు మరియు మహేష్ బాబు వారి ముగ్గురి సొంత నిర్మాణ సంస్థలు కలిసి భారీగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న గారు ఈ సినిమాలో కథా నాయికగా తొలిసారి మహేష్ బాబు గారికి జోడిగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మహేష్ బాబు గారి పుట్టిన రోజున, ఆగస్టు 15 పర్వదినాన, దసరా పండుగ కానుకగా ఇలా వరుసగా ఎదో ఒక పండుగ రోజున సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి మొదటి పోస్టర్, మొదటి పాట, మహేష్ బాబు గారికి సంబందించిన స్టిల్స్ అంటూ ఒకొక్కటిగా విడుదల చేసుకుంటూ వచ్చారు సినిమా యూనిట్ వాళ్ళు. ఇక రాబోవు దీపావళి పండగకి కూడా ఇంకొక ట్రైలర్ కానీ, పోస్టర్ కానీ విడుదల చేయబోతున్నాము అని దర్శకులు అనిల్ రావిపూడి గారు తన ట్విటర్ నుండి “దీపావళికి మీరు అందరూ సిద్దంగా ఉండండి” అని ఒక వార్త బయటికి వచ్చింది. ఆ ట్విటర్ వార్త లో చెస్ బోర్డు మీద రాజు ఒక్కడే నిలబడి ఉన్నారు, మిగిలిన వారు కుప్పకూలి పోయారు అని సింబాలిక్ గా ఒక ఫోటో కూడా అప్లోడ్ చేసారు.

ఇక ట్విటర్ లో పోస్ట్ చూసిన మహేష్ బాబు అభిమానులు ఎలా అయితే మహేష్ బాబు కొత్త పోస్టర్ గురించి ఎదురుచూస్తున్నారో? అంతకంటే ఎక్కువగా విజయశాంతి గారి లుక్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు విజయశాంతి గారి అభిమానులు. ఇది తెలుసుకున్న కొంతమంది నెటిజన్లు మహేష్ బాబు – విజయశాంతి ఇద్దరిలో మీరు ఎవరి కొత్త లుక్ కోసం ఎదురుచూస్తున్నారు? అని ఓటింగ్ పెడితే ఎక్కువ మంది విజయశాంతి గారికి ఓట్లు వేసారు. కారణం ఇప్పటికీ మహేష్ బాబు గారికి సంబందించిన స్టిల్స్ మాద్యమాల్లో మనం చూస్తూనే ఉన్నాము. కానీ విజయశాంతి గారి స్టిల్స్ మాత్రం ఇంకా విడుదల అవ్వలేదు. అందువలన విజయశాంతి గారికి ఓట్లు ఎక్కువ పడ్డాయి.

ఇక జనాల ఇష్టం మేరకు సినిమా బృందం వారు విజయశాంతి గారికి సంబందించిన స్టిల్స్ దీపావళి పండగ రోజున విడుదల చేయబోతున్నారు అని నిర్మాత ‘దిల్ రాజు’ గారి ఆఫీసు నుండి ఎక్కువగా వినిపిస్తున్న మాట. మరి ఇందులో ఎంత నిజం ఉందో? లేదో? అనేది పక్కన పెడితే చాలా కాలం తర్వాత విజయశాంతి గారు తెలుగు తెర మీద కనపడుతున్నారు కాబట్టి విజయశాంతి గారికి సంబందించిన ఫోటో లు విడుదల చేస్తే మంచిది అని అందరూ అనుకుంటున్నారు.