పేట రివ్యూ


petta movie review
పేట రివ్యూ
:
నటీనటులు : రజనీకాంత్ , సిమ్రాన్ , త్రిష
సంగీతం : అనిరుధ్
నిర్మాణం : సన్ పిక్చర్స్
దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజు
రేటింగ్ : 2. 5/ 5
రిలీజ్ డేట్ : 10 జనవరి 2019

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ” పేట ” . యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలతో పోటీపడి మరీ విడుదల అయ్యింది . గతకొంతకాలంగా అభిమానులను నిరాశ పరుస్తున్న రజనీ ఈ సినిమాతోనైనా ఆకట్టుకున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

కథ :

హాస్టల్ లో వార్డెన్ గా పనిచేసే కాళీ ( రజనీకాంత్ ) అక్కడి సమస్యలను పరిష్కరిస్తుంటారు . అయితే ఓసారి స్థానిక గుండా తో కాళీ కి గొడవ జరుగుతుంది . అయితే కాళీ ని అంతం చేయాలనుకున్న వాళ్లకు అతడు కాళీ కాదు ఉత్తర ప్రదేశ్ కు చెందిన పేట అని తెలుస్తుంది . దాంతో కాళీ అలియాస్ పేట అనబడే వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చాడు , అతడి వల్ల హాస్టల్ కు జరిగిన న్యాయం ఏంటి ? కాళీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

రజనీకాంత్ పెర్ఫార్మెన్స్
ఫస్టాఫ్ ఎంటర్ టైన్ మెంట్

డ్రా బ్యాక్స్ :

స్టోరీ , స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

రజనీకాంత్ స్టైల్ , పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . అభిమానులు కోరుకునే విధంగా రజని లుక్స్ కానీ స్టైల్ కానీ ఉన్నాయి దానికి తోడు కామెడీ తో కూడా అలరించాడు రజనీకాంత్ . రజనీకాంత్ అభిమానులకు పేట పిచ్చ పిచ్చగా నచ్చడం ఖాయం . ఇక రజనీకాంత్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది , అదరగొట్టాడు . సిమ్రాన్ , త్రిష లకు మంచి పాత్రలే లభించాయి దాంతో వాటిని సద్వినియోగం చేసుకున్నారు . విజయ్ సేతుపతి కి అలాగే నవాజుద్దీన్ సిద్ధికి లు కూడా నటించారు కానీ వాళ్లకు అంతగా ప్రాధాన్యత లేదు .

సాంకేతిక వర్గం :

ఈ సినిమాకు తిరు ఫోటోగ్రఫీ హైలెట్ అనే చెప్పాలి , విజువల్స్ తో ఆకట్టుకున్నాడు తిరు . అనిరుధ్ పాటలు ఫరవాలేదు , నేపథ్య సంగీతం తో అదరగొట్టాడు . నిర్మాణ విలువలు బాగున్నాయి , ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు విషయానికి వస్తే …… రజనీకాంత్ ని అద్భుతంగా చూపించాలనే మంచి ప్రయత్నం చేసాడు , అయితే కథ , కథనం ని మాత్రం ఆ స్థాయిలో రాసుకోలేకపోయాడు . ఫస్టాఫ్ ని బాగానే రాసుకున్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి తేలిపోయాడు .

ఓవరాల్ గా :

రజనీకాంత్ అభిమానులకు మాత్రమే ఈ పేట .

English Title: petta movie review

Click here for English Review