ఫ‌స్ట్‌లుక్ స్టోరీ: చుర‌క‌త్తుల్లాంటి చూపుల్తో..!


ఫ‌స్ట్‌లుక్ స్టోరీ: చుర‌క‌త్తుల్లాంటి చూపుల్తో..!
ఫ‌స్ట్‌లుక్ స్టోరీ: చుర‌క‌త్తుల్లాంటి చూపుల్తో..!

`బాహుబ‌లి` ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇందులో న‌టించిన రానా భ‌ల్లాల దేవుడిగా క‌నుసైగ‌ల‌తోనే త‌న హావ‌భావాల్ని ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకున్నారు. ఈ సినిమాతో విశ్వ‌వ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఆయ‌న పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా `విరాట‌ప‌ర్వం` చిత్రంలోని త‌న ఫ‌స్ట్‌ లుక్‌ను హీరో రానా శుక్ర‌వారం అర్థ్ర‌రాత్రి రిలీజ్ చేశారు. `నేను న‌టిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ గ్లింస్ ఇదే` అని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌లో రానా ముఖానికి రెడ్ స్కార్ఫ్ క‌ట్టుకుని చుర‌క‌త్తుల్లాంటి చూపుల్తో ఇంటెన్సీవ్ లుక్‌లో రానా క‌నిపిస్తున్న తీరు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

రానా సాయి ప‌ల్ల‌వి జంటగా `నీది నాది ఒకేక‌థ` ఫేమ్ వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గ‌త కొంత కాలంగా రానా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ విదేశాల్లో చికిత్స పొందిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో సాయిప‌ల్ల‌వి పై రెండు కీల‌క షెడ్యూళ్ల‌ని ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల పూర్తి చేశారు. ఇటీవ‌ల రానా హైద‌రాబాద్ తిరిగి రావ‌డంతో శుక్ర‌వారం నుంచి రానాపై షూటింగ్ మొద‌లైంది. శుక్ర‌వారం నుంచి రానా పాల్గొన‌గా ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల రామోజీ ఫిల్మ్ సిటీలొ కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు.

ఫ‌స్ట్‌లుక్‌లోనే సినిమా థీమ్ ఏంటో అర్థ‌మ‌య్యేలా ద‌ర్శ‌కుడు రివీల్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ప్రేమ‌, పోరాటం, రెండు హృద‌యాల సంఘ‌ర్ష‌ణ‌ నేప‌థ్యంలో ఈ సినిమాని తెర‌పైకి తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. 1995 మ‌ధ్య కాలంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్ధ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో న‌క్స‌లిజాన్ని ప్ర‌ధానాంశంగా తీసుకుని వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కోసం మాన‌వ హ‌క్కుల నేత‌గా ముందు ట‌బుని అనుకున్నారు. అయితే అప్ప‌టికే త్రివిక్ర‌మ్ `అల వైకుంఠ‌పురంలో` చిత్రానికి తీసుకోవ‌డంతో ఆ స్థానంలో బాలీవుడ్ న‌టి నందితా దాస్‌ని ఫైన‌ల్ చేసుకున్నారు. శ‌నివారం బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న‌ సంద‌ర్భంగా హీరో రానాకు Tollywood.net పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తోంది.

Credit: Twitter