ఫోటోస్టోరీ: చ‌ంద‌మామ వీకెండ్ హంగామా!


ఫోటోస్టోరీ: చ‌ంద‌మామ వీకెండ్ హంగామా!
ఫోటోస్టోరీ: చ‌ంద‌మామ వీకెండ్ హంగామా!

వ‌రుస చిత్రాలు ప‌రాజ‌యాల్ని సొంతం  చేసుకుంటున్నా చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. కెరీర్ ప‌రంగా కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నకాజ‌ల్ వ్య‌క్తిగ‌తంగా మాత్రం ఏ విష‌యంలోనూ త‌గ్గ‌డం లేదు. క్రేజీ క‌థానాయిక‌గా స్టార్‌డ‌మ్ త‌గ్గినా వీకెండ్ పార్టీల‌తో హంగామా చేస్తోంది. ఇటీవ‌ల అత్యంత స‌న్నిహితులు, ఫ్రెండ్స్‌తో క‌లిసి గోవా వెళ్లిన కాజ‌ల్ అక్క‌డ ఓ రేంజ్‌లో హంగామా చేసేసింది. దానికి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో అభిమానుల‌తో కాజ‌ల్ పంచుకున్నఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

వీకెండ్ పార్టీల‌తో పాటు త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన వారి వివాహానికి హ‌జ‌రైంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అక్క‌డ కూడా త‌న జోష్‌ని ఏ మాత్రం త‌గ్గించ‌కుండా కొత్త జంట జాస‌న్‌, ఎల్సాతో క‌లిసి ర‌చ్చ చేసింది. వారితో క‌లిసి వీకెండ్‌ని ఎంజాయ్ చేసిన ఫొటోల‌ని కూడా  సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వండ‌ర్‌ఫుల్ వీకెండ్‌ని చాలా ఎంజాయ్ చేశాన‌ని, జాస‌న్‌, ఎల్సాల మ్యారేజ్ చాలా అద్భుతంగా జ‌రిగింద‌ని, ఈ సంద‌ర్భంగా వారికి శుభాకాంశక్ష‌లు తెలియ‌జేసింది.

తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం దిగ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ రూపొందిస్తున్న `ఇండియ‌న్‌-2`లో క‌మ‌ల్‌హాస‌న్‌కు జోడీగా న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకుందీ చంద‌మామ‌. దీనితో పాటు త‌మిళంలో `క్వీన్‌` ఆధారంగా రూపొందిన `పారిస్ పారిస్‌`, హిందీలో `ముంబై స‌గా`, తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో మంచు విష్ణు హీరోగా తెర‌కెక్కుతున్న `మోస‌గాళ్లు` చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ సినిమాల‌తో కాజ‌ల్ మ‌ళ్లీ త‌న పూర్వ‌వైభవాన్ని సొంతం చేసేకుంటుందో లేదో చూడాలి.