బిగ్ బాస్ 3 ని నిలిపివేయాలని హైకోర్టులో పిల్


Bigg Boss 3-Telugu
Bigg Boss 3-Telugu

బిగ్ బాస్ 3 ని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు . బిగ్ బాస్ షో ఇంట్లిల్లిపాది చూసేలా లేదు కాబట్టి ఈ షోని రద్దు చేయాలి లేదంటే రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేయాలనీ , అది కూడా సీరియల్ లా ప్రసారం చేయాలనీ కోరాడు పిటిషనర్ . అంతేనా బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున తో పాటుగా మరో పదిమందిని ప్రతివాదులుగా చేర్చాడు పిటీషనర్ .

అంతేకాదు బిగ్ బాస్ 3 పై పలువురు ఆరోపణలు చేయడమే కాకుండా కేసులు కూడా పెట్టారు దాంతో ఆ కేసులను రద్దు చేయాలనీ కోరుతూ హైకోర్టులో క్యాష్ పిటీషన్ వేశారు బిగ్ బాస్ నిర్వాహకులు . ఈ రెండు కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది . ఈనెల 21న బిగ్ బాస్ 3 సీజన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో రసవత్తరంగా తయారయ్యింది పరిస్థితి .