`పింక్‌` రీమేక్ నుంచి ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేస్తోంది!


`పింక్‌` రీమేక్ నుంచి ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేస్తోంది!
`పింక్‌` రీమేక్ నుంచి ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేస్తోంది!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న బాలీవుడ్ రీమేక్ `పింక్‌`. శ్రీ‌రామ్ వేణు రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని బోనీక‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ఫుల్ స్పీడుగా జరుగుతోంది. ఇటీవ‌ల గ‌డ్డం లుక్‌తో తొలి షెడ్యూల్‌లో న‌టించిన ప‌వ‌న్ తాజా షెడ్యాల్‌లో గ‌డ్డం తీసేసి క్లీర్ షేవ్‌తో క‌నిపిస్తున్నారు. ఇటీవ‌లే సెకండ్ షెడ్యూల్ మొద‌లైంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ప‌లు కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. బ్లాక్ బ్లేజ‌ర్ ధ‌రించి ఈ షూట్‌లో ప‌వ‌న్ పాల్గొంటున్న స్టిల్స్ ఇటీవ‌లే లీకయ్యాయి.

ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ పాట‌ని ప‌వ‌న్‌కు త‌మ‌న్ వినిపించార‌ని. ప‌వ‌న్ బాగుంద‌ని అభినందించడంతో త‌మ‌న్ భావోద్వేగానికి లోనైన‌ట్టు ఫిల్మ్‌స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య నాగ‌ల్ల కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ని దిల్ రాజు ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌. మార్చిలో ఫ‌స్ట్‌లుక్‌ని రిలీజ్ చేసి చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప‌వ‌న్ న‌టించిన `గబ్బ‌ర్‌సింగ్‌` మే 11న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుంది.

Credit: Twitter