`పింక్` రీమేక్..ప‌వ‌న్ మొద‌లెట్టేది అప్పుడే!


`పింక్` రీమేక్..ప‌వ‌న్ మొద‌లెట్టేది అప్పుడే!
`పింక్` రీమేక్..ప‌వ‌న్ మొద‌లెట్టేది అప్పుడే!

బాలీవుడ్‌తో పాటు త‌మిళంలొ `పింక్‌` సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌, తాప్సీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. త‌మిళంలో ఇదే చిత్రాన్ని నేర్కొండ పార్వై` పేరుతో బోనీక‌పూర్ రీమేక్ చేస్తే అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. అజిత్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని `ఖాకీ` ఫేమ్ హెచ్‌. వినోద్ ఈ చిత్రాన్ని త‌మిళంలో తెర‌క‌క్కించారు. క‌మ‌ర్షియ‌ల్ అంశాల మేళ‌వింపులో మాస్ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొంద‌డంతో త‌మిళ ప్రేక్షకులు ఈ చిత్రానికి భారీ విజ‌యాన్ని అందించి క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురిపించారు.

ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్నారు. గ‌త కొంత కాలంగా రాజ‌కీయాల్లో బిజీగా వున్నప‌వ‌న్ మ‌ళ్లీ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ప‌వ‌న్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ వేణు రూపొందించ‌బోతున్నారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ తొలిసారి తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. కీల‌క పాత్ర‌ల్లో స‌మంత‌, నివేధా థామ‌స్‌, అంజ‌లి న‌టించే అవ‌కాశం వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌లే లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ సినిమా ఈ నెల 20 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తాజాగా స‌మాచారం. ఈ సినిమా కోసం ప‌వ‌న్ త‌క్కువ డేట్స్ మాత్ర‌మే ఇచ్చార‌ట‌. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ ఫాస్ట్‌గా సినిమాని పూర్తి చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.