విజయ్ దేవరకొండని టార్గెట్ చేసారా ?

Piracy Target Vijay devarakondaపైరసీ దారులను విజయ్ దేవరకొండ ఘాటుగా విమర్శించడంతో వాళ్ళు ఈ హీరోపై ఆగ్రహంగా ఉన్నారని గుసగుసలు వినబడుతున్నాయి . విజయ్ దేవరకొండ మైకు అందుకుంటే ఎమోషన్ అయిపోయి కొంతమందిని బాగా విమర్శించడం బాగా అలవాటు అయ్యింది . అయితే కెరీర్ లో స్టార్ హీరో స్టేటస్ కు చేరుకున్న ఈ హీరో ముందు ముందు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని ఎందుకంటే పైరసీదారులు విజయ్ ని టార్గెట్ చేసారని అంటున్నారు . ఇప్పటికే ఈ హీరో నటించిన గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలు పైరసీ బారిన పడగా రెండు కూడా మంచి హిట్స్ అయ్యాయి . అయితే అదృష్టం కొద్దీ హిట్స్ అయ్యాయి , కానీ అన్నిసార్లు అన్ని అంశాలు కలిసి రావు .

ఒక్కోసారి చిన్న చిన్న తప్పిదాలే పెద్ద దెబ్బ కొడతాయి . దాంతో విజయ్ తన సినిమాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు . టాక్సీ వాలా చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించడమే కాకుండా మంచి వసూళ్ల ని సాధిస్తోంది . యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నాడు కాబట్టి కెరీర్ పట్ల జాగ్రత్త తీసుకుంటే మంచిది .

English Title: Piracy Target Vijay devarakonda