హీరో రాజ‌శేఖ‌ర్ హెల్త్‌పై‌ తాజా హెల్త్ బులిటెన్‌

హీరో రాజ‌శేఖ‌ర్ హెల్త్‌పై‌ తాజా హెల్త్ బులిటెన్‌
హీరో రాజ‌శేఖ‌ర్ హెల్త్‌పై‌ తాజా హెల్త్ బులిటెన్‌

యాంగ్రీ యంగ్‌మెన్ హీరో డా. రాజ‌శేఖ‌ర్ తో పాటు జీవిత, ఇద్ద‌రు కూతుళ్లు శివాని, శివాత్మిక కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే రాజ‌శేఖ‌ర్‌, జీవిత మిన‌హా శివాని, శివాత్మ‌క క‌రోనా నుంచి కోలుకున్నారు. రాజ‌శేఖ‌ర్, జీవిత ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఇటీవ‌ల జీవిత‌కు నెగెటివ్‌రావ‌డంతో హాస్పిట‌ల్‌నుంచి డిశ్చార్చ్ చేశారు.

రాజ‌శేఖ‌ర్ మాత్రం ఇంకా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఐసీయూలో వెంటిలేట‌ర్ స‌హాయంతో ఆయ‌న‌కు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఇటీవ‌ల శివాత్మిక ట్విట్ట‌ర్ వేదిక‌గా పెట్టిన పోస్ట్ రాజ‌శేఖ‌ర్ అభిమానుల్ని, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్ని ఆందోళ‌న‌కు గురిచేసింది. త‌మ ఫాద‌ర్ క‌రోనాతో పోరాడుతున్నార‌ని, చాలా గ‌ట్టిగా ఫైట్ చేస్తున్నార‌ని, ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డాల‌ని ప్రార్థ‌న చేయండ‌ని ట్వీట్ చేసింది.

దీంతో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై పుకార్లు మొద‌ల‌య్యాయి. దీనిపై వివ‌ర‌ణ ఇస్తూ శివాత్మిక ఫేక్ న్యూస్‌ని ప్ర‌చారం చేయ‌కండ‌ని ట్వీట్ చేసింది. తాజాగా రాజ‌శేఖ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై తాజాగా సిటీ న్యూరో సెంట‌ర్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. రాజ‌శేఖ‌ర్ గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నార‌ని, ఆయ‌న‌కు ప్లాస్మా థెర‌పీ చికిత్స అందిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో రాజ‌శేఖ‌ర్ అభిమానులు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఊపిరి పీల్చుకున్నారు.