ప్ర‌ధాని మోదీని క‌లిసిన మాధ‌వ‌న్‌!

ప్ర‌ధాని మోదీని క‌లిసిన మాధ‌వ‌న్‌!
ప్ర‌ధాని మోదీని క‌లిసిన మాధ‌వ‌న్‌!

విభిన్న‌మైన చిత్రాలు, పాత్ర‌ల్ని ఎంచుకుంటూ త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నారు మాధ‌వ‌న్‌. తాజాగా ఆయ‌న న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న చిత్రం `రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్‌`. ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌న‌ణ్ జీవిత క‌థ ఆధా‌రంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ ట్రైల‌ర్‌ని రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. ఇదిలా వుంటే కొన్ని వారాల కింద‌ట నంబి నారాయ‌న‌ణ్‌తో క‌లిసి మాధ‌వ‌న్ ప్ర‌ధాన‌ని క‌లిసి న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించి ప్ర‌ధానితో స‌మావేశం అయిన కొన్ని ఫొటోల‌ని పంచుకున్నారు.

ఇస్రోలో విశేష‌మైన సేల‌వ‌లు అందించిన నంబి నారాయ‌న‌ణ్ 1994లో దేశ ద్రోహి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. కోర్టు విచార‌ణల అనంత‌రం ఆయ‌న నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఆనాడు ఆయ‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాల ప‌ట్ల ప్ర‌ధాని మోదీ విచారం వ్య‌క్తం చేశారు. `కొన్ని వ‌రాల క్రితం నంబి నారాయ‌ణ‌న్‌కు, నాకు ప్ర‌ధాని మోదీ నుంచి గౌర‌వ సూచికంగా పిలుపు వ‌చ్చింది. ఆయ‌న‌ను క‌లిసిన సంద‌ర్భంగా `రాకెట్రీ` గురించి మాట్లాడాం. చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించి కొన్ని క్ల‌ప్స్ చూపించాం. గ‌తంలో నంబీజీకి జ‌రిగిన దాని ప‌ట్ల ప్ర‌ధాని విచారం వ్య‌క్తం చేశారు. మిమ్మల్ని క‌ల‌వ‌టం మాకు ద‌క్కిన గౌర‌వం మోదీ సార్‌` అని ఈ సంద‌ర్భంగా మాధ‌వ‌న్ ట్వీట్ చేశారు.

మాధ‌వ‌న్ తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ న‌టిస్తున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌కు విశేష స్పంద‌న ల‌భించింది. ఇందులోని కీల అతిథి పాత్ర‌ల్లో తెలుగు, త‌మిళ భాష‌ల‌కు సూర్య న‌టించ‌గా, హిందీ వెర్ష‌న్‌లో మాత్రం బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ఖాన్ న‌టించ‌డం విశేషం. ఈ చిత్రాన్ని త‌మిళ‌, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు.