క‌రోనా చిక్కుల్లో జొన్న‌విత్తుల!‌


క‌రోనా చిక్కుల్లో జొన్న‌విత్తుల!‌
క‌రోనా చిక్కుల్లో జొన్న‌విత్తుల!‌

ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత జొన్న‌విత్తుల రామ‌లింగేశ్వ‌ర‌రావు క‌రోనా కార‌ణంగా చిక్కుల్లో ప‌డ్డారు. క‌రోనాపై ఆయ‌న పాడిన ప‌ద్య‌మే ఆయ‌న‌ని చిక్కుల్లో ప‌డేసింది. ఎస్సీ, ఎస్టీల‌ని కించ‌ప‌రిచే విధంగా అంట‌రాని త‌నాన్ని ప్రోత్స‌హించేలా జ‌న్న‌విత్తుల పాడిన ప‌ద్యం వుందంటూ తెలంగాణ‌కు చెందిన మాల సంక్షేమ‌సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు బ‌త్తుల రాంప్ర‌సాద్ విమ‌ర్శించ‌డ‌మే కాకుండా జొన్న‌విత్తుల‌పై కేసు ఫైల్ చేయించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

క‌రోనా మ‌హ‌మ్మారిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది పాట‌లు, రాప్ సాంగ్స్ విడుద‌ల చేశారు. కొంత‌ మందైతే వ‌ల‌స జీవుల‌పై కూడా పాట‌ల్ని విడుద‌ల చేశారు. అయితే జొన్న‌విత్తుల పాడిన ప‌ద్యంలో బ్రాహ్మ‌ణుల‌ను పొగుడుతూ అంట‌రానిత‌నాన్ని ప్రోత్స‌హిస్తూ ద‌ళితుల‌ని కించ‌ప‌రిచే విధంగా జొన్న విత్తుల ప‌ద్యం వుంద‌ని ద‌ళిత సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

జొన్న‌విత్తుల ఇటీవ‌ల రామ్‌గోపాల్‌వ‌ర్మ‌పై కోపంతో `ఆర్జీవి` పేరుతో ఓ సినిమాకు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లై టైటిల్ ని ప్ర‌క‌టించిన ఆయ‌న త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌బోతున్నారు.