మోహన్ బాబుని అరెస్ట్ చేయనున్నారా ?


Political attension :Mohan babu dharna in tirupati

శ్రీ విద్యానికేతన్ సంస్థల అధినేత , సినీ నటుడు మోహన్ బాబు అరెస్ట్ కు రంగం సిద్ధమైంది . ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈరోజు తిరుపతిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి సన్నాహాలు చేసాడు మోహన్ బాబు దాంతో రంగప్రవేశం చేసిన  పోలీసులు మోహన్ బాబు ని ముందస్తు చర్యలో భాగంగా హౌజ్ అరెస్ట్ చేయడానికి ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది .

 

ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో మోహన్ బాబు ధర్నా తప్పకుండా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది దాంతో మోహన్ బాబు ని కట్టడి చేయడానికి సిద్ధమయ్యారు పోలీసులు . 16 కోట్ల ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయి ఉందని , అందుకే పోరాటం చేస్తున్నామని అంటున్నారు మోహన్ బాబు .

English Title: Political attension :Mohan babu dharna in tirupati