జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబు రాజకీయ మంతనాలు


Jr NTR Chandrababu

జూనియర్ ఎన్టీఆర్ తో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయ మంతనాలు సాగించినట్లుగా తెలుస్తోంది . నందమూరి హరికృష్ణ సంవత్సరీకం సందర్బంగా హరికృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ని , నందమూరి కళ్యాణ్ రామ్ ని పరామర్శించాడు . హరికృష్ణ చిత్ర పటానికి నివాళులు అర్పించిన అనంతరం జూనియర్ తో కాసేపు మంతనాలు సాగించాడట .

తెలుగుదేశం పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది తెలుగు రాష్ట్రాలలో . తెలంగాణలో అయితే తెలుగుదేశం అడ్రస్ లేకుండాపోయింది , అయితే గుడ్డిలో మెల్ల లాగా ఆంధ్రప్రదేశ్ కాస్త బెటర్ అసెంబ్లీ లో కనీసం 23 మంది ఎం ఎల్ ఏ లున్నారు . పరిస్థితి చూస్తుంటే 23 మంది ఎం ఎల్ ఏ లలో మళ్ళీ ఎన్నికలు వచ్చే నాటికీ 5 మంది లేక 10 మంది మిగిలితే పెద్ద గొప్పే అన్నట్లుగా ఉంది . దాంతో తెలుగుదేశం పార్టీని కాపాడాలంటే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాత్రమే అవుతుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు . అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపించడం లేదు .