రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వివేకానంద హత్య


Political heat in AP with YS Vivekananda murder

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది . నిన్న వై ఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన విషయం తెలిసిందే . అయితే మొదట గుండెపోటు అంటూ ప్రచారం సాగింది , 11 గంటల తర్వాత వివేకా ని హత్య చేసారని హడావుడి చేసారు .వివేకా డెడ్ బాడీని  ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం చేసిన తర్వాత అది హత్యగా తేల్చారు డాక్టర్లు .

 

వివేకానంద ఇంట్లో ఒంటరిగా ఉండటం , రక్తం మడుగులో పడిఉండటం ఆపై శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది . ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తున్నది .  వివాదాలకు దూరంగా ఉండే వివేకానంద రెడ్డి ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది అన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు . వివేకా హత్యతో రాజకీయ వర్గాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది . ఇది ప్రభుత్వం చేయించిన హత్య అంటూ జగన్ ఆరోపిస్తుండగా తెలుగుదేశం పార్టీ కూడా తక్కువేమి తినలేదు వై ఎస్ వివేకానంద రెడ్డి ని మీరే చంపించారు అంటూ ప్రత్యారోపణలు చేస్తున్నారు . మొత్తానికి వివేకా హత్య ఆంధప్రదేశ్ రాజకీయాలలో సంచలనం అయ్యింది .

English Title : Political heat in AP with YS Vivekananda murder