వచ్చే ఏడాదే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్

వచ్చే ఏడాదే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్
వచ్చే ఏడాదే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్

క్లాసికల్ దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు మణిరత్నం. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు ఈరోజు అధికారికంగా తెలిపాడు. దీనికి పీఎస్ 1 (పొన్నియన్ సెల్వన్) అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. “గోల్డెన్ ఎరా వచ్చేస్తోంది” అని టీమ్ అధికారికంగా ప్రకటించారు.

అలాగే ఈ సినిమాను 2022లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పొన్నియన్ సెల్వన్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే హైదరాబాద్ లో ఈ చిత్ర చివరి షెడ్యూల్ ఉంటుంది. పొన్నియన్ సెల్వన్ లో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రాజా, ఐశ్వర్య లక్ష్మిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు అద్భుతమైన సాంకేతిక టీమ్ కూడా పనిచేస్తోంది. ఏఆర్ రహ్మాన్ సంగీతం అందిస్తుండగా రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నాడు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.