“కరోనా” భయం ఉన్నా సరే… “కాళ్ళ” విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు..!


“కరోనా” భయం ఉన్నా సరే... “కాళ్ళ” విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు..!
“కరోనా” భయం ఉన్నా సరే… “కాళ్ళ” విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు..!

“కళ… కళ కోసం కాదు… ఇల (ప్రపంచం) కోసమే ఉంటుంది.!” అని వెనకటికి ఒక పెద్దాయన చెప్పిన మాటలు నేటికి అక్షర సత్యాలు. కాకపోతే ప్రస్తుతం ప్రపంచం కొంచెం అడ్వాన్స్ అయ్యింది కాబట్టి రిఫరెన్స్ కొంచెం మార్చుకుని… “తన కాళ్ళు తన కోసం కాదు… లోక కళ్యాణం కోసం” అని చదువుకుందాం. ఈ లోకంలో కొంతమంది మనుషులు పుట్టేది కేవలం వాళ్ళ కోసం కాదు. లోక కళ్యాణం కోసం. వాళ్ళు ఏం చేసినా… అది కూడా లోక కళ్యాణం కోసమే.

ఇక మన బుట్టబొమ్మ పూజా విషయానికి వస్తే… ఒక పక్క తీరిక లేని షూటింగ్ లు, అలసట తెప్పించే ఫ్లైట్ జర్నీలు, ఎక్కడకు వెళ్ళినా కరోనా భయాలు, ఇలాంటి కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల మధ్య కూడా.. అభిమానులకు ఎల్లపుడు తన సోషల్ మీడియా ద్వారా ఎల్లపుడు అందుబాటులో ఉంటూ… ఇదిగో ఇలా… కరోనా వైరస్ రాకుండా మాస్క్ తో కవర్ చేసుకోమని జాగ్రతలు చెప్పే మంచి మనసు ఉన్న మేడం మన పూజా హేగ్దే. ఇక ఈ ఫోటో చూసిన మేడం డైహార్డ్ ఫ్యాన్స్ అంతా…. భావోద్వేగానికి గురై… అభిమానంతో కూడిన ప్రేమతో వచ్చిన కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్తున్నారు.

ఇక పూజా ప్రభాస్ సినిమా మరియు అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్” సినిమాతోపాటు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ సినిమా అయిన “కభీ ఈద్ – కభి దివాలీ” సినిమాలో కూడా నటిస్తోంది.