పూజా హెగ్డే నో కాంప్ర‌మైజ్ అంటోందిగా?

పూజా హెగ్డే నో కాంప్ర‌మైజ్ అంటోందిగా?
పూజా హెగ్డే నో కాంప్ర‌మైజ్ అంటోందిగా?

టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ పారితోషికం త‌గ్గించుకోమ‌ని రిక్వెస్ట్ చేస్తున్నా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం అస్స‌లు త‌గ్గ‌నంటోంది. అందం, అభిన‌యంతో పాటు హైలీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే అందం, అభిన‌యంతో సంబంధం లేకుండా క్రేజ్‌ని సొంతం చేసుకున్న హీరోయిన్ పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్ హీరోల‌కు ఓన్లీ వ‌న్ ఆఫ్ ది ఆప్ష‌న్‌గా మారింది.

దీంతో రెమ్యున‌రేష‌న్ భారీగానే డిమాండ్ చేస్తోంది. ఓ ప‌క్క ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ న‌టీన‌టులు త‌మ పారితోషికాలు త‌గ్గించుకోవాల‌ని చెబుతుంటే తాను మాత్రం ఎక్క‌డా త‌గ్గేది లేద‌ని క‌రాకండీగా చెబుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. కోటి నుంచి కోటిన్న‌ర మాత్ర‌మే తీసుకుంటున్న పూజా తాజాగా దాన్ని 2.5 కోట్ల‌కు పెంచిన‌ట్టు తెలిసింది.

టాలీవుడ్‌లో పూజాను మించిన హీరోయిన్‌లు లేక‌పోవ‌డం.. హీరోయిన్‌ల కొర‌త వుండ‌టంతో పూజ డిమాండ్‌కు నిర్మాత‌లు త‌లొగ్గుతున్నార‌ట‌. అనుష్క ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ రెమ్యున‌రేషన్ పొందుతున్న హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌లో నిలిచింది. తాజాగా అనుష్క‌ని కిందికి నెట్టి పూజా హెగ్డే 2.5 కోట్ల‌తో ప్ర‌ధ‌మ స్థానంలో నిలిచిన‌ట్టు చెబుతున్నారు.