డ్రంక్ అండ్ డ్రైవ్ లో పూజా హెగ్డే


డ్రంక్ అండ్ డ్రైవ్ లో పూజా హెగ్డే
పూజా హెగ్డే

మహేష్ బాబు హీరోయిన్ పూజా హెగ్డే డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్కయ్యింది . మహేష్ బాబు సరసన మహర్షి చిత్రంలో నటించింది పూజా హెగ్డే . మహర్షి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1న జరిగిన విషయం తెలిసిందే . ఆ వేడుకలో పాల్గొన్న పూజా హెగ్డే ఆ వేడుక ముగిసిన తర్వాత చిత్ర బృందం ఇచ్చిన పార్టీ లో పాల్గొంది . అందులో బాగా తాగేసిన ఈ భామ తన మిత్రులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయింది .

అయితే అదృష్టవశాత్తు డ్రైవింగ్ సీట్లో పూజా హెగ్డే లేకపోవడంతో ఆమెని వదిలేసారు . పూజా హెగ్డే మత్తులో ఉంది కానీ డ్రైవింగ్ సీట్లో లేదు దాంతో పూజా కారుని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు . ఇక చేసేది లేక మరో కారులో తన హోటల్ కు వెళ్ళింది పూజా హెగ్డే . మహర్షి ప్రీ రిలీజ్ వేడుక జరిగింది ఇక మిగిలింది సినిమా విడుదల కావడమే ! మే 9 న భారీ ఎత్తున మహర్షి చిత్రం విడుదల అవుతోంది .