తనపై వస్తోన్న రూమర్స్ విషయంలో స్పందించిన పూజ హెగ్డే

తనపై వస్తోన్న రూమర్స్ విషయంలో స్పందించిన పూజ హెగ్డే
తనపై వస్తోన్న రూమర్స్ విషయంలో స్పందించిన పూజ హెగ్డే

పూజ హెగ్డే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వరసగా సూపర్ హిట్ సినిమాల్లో పూజ హెగ్డే భాగం అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధే శ్యామ్ లో పూజ హెగ్డే నటిస్తోంది. అలాగే అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రంలో కూడా నటిస్తోంది.

ఇటీవలే రాధే శ్యామ్ ఇటలీ షెడ్యూల్ ను ముగించుకుని హైదరాబాద్ కు యూనిట్ తిరిగివచ్చిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా పూజ హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “సౌత్ లో నాభి సౌందర్యం పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది” అన్నట్లుగా కామెంట్ చేసింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో పూజ హెగ్డే తన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

“నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రాణసమానం. ఇది నా చిత్రాలను అభిమానించే వారికి నా అభిమానులకు తెలిసినా, ఎటువంటి అపార్ధాలకు తావివ్వకూడదనే నేను మళ్ళీ చెబుతున్నా. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ ఋణపడి ఉంటాను. దయచేసి మొత్తం వీడియోను చూడండి” అని పూజ హెగ్డే వివరణ ఇచ్చింది.