అప్పుడే ఓ నిర్ణ‌యానికి రాకండి:  పూజా హెగ్డే

అప్పుడే ఓ నిర్ణ‌యానికి రాకండి:  పూజా హెగ్డే
అప్పుడే ఓ నిర్ణ‌యానికి రాకండి:  పూజా హెగ్డే

పూజా హెగ్డే.. టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌కున్న ఏకైక ఆప్ష‌న్‌. ఇప్పుడు కోలీవుడ్ హీరోల‌కు కూడా పూజా హెగ్డేనే ఆప్ష‌న్‌గా మారిన‌ట్టు తెలుస్తోంది. తెలుగులో వ‌రుస భారీ చిత్రాల్లో న‌టించి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే త్వ‌ర‌లోనే త‌మిళ ఇండ‌స్ట్రీని కూడా ప‌ల‌క‌రించ‌బోతోందంటూ గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థనాలు విపిస్తున్నాయి.

సూర్య హీరోగా న‌టిస్తున్న ఓ చిత్రంతో పూజా హెగ్డే హీరోయిన్ త‌మిళ తెర‌కు రీ ఎంట్రీ ఇవ్వ‌బోతోందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. సూప‌ర్ హీరో కాన్సెప్ట్‌తో జీవా హీరోగా 9 ఏళ్ల క్రితం వ‌చ్చిన చిత్రం `మూగ‌మూడి`. ఈ సినిమాతో హీరోయిన్‌గా త‌మిళ తెర‌పై కెరీర్ ప్రారంభించిన `ఒక లైలా కోసం` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

త్వ‌ర‌లో త‌మిళ తెర‌కు రీఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు తాను త‌మిళంలో ఏ సినిమాను ఓకే చేయ‌లేద‌ని, క‌థ‌లు మాత్రం వింటున్నాన‌ని, అప్పుడే తొంద‌ర‌ప‌డి తాను ఏదో ఒక హీరో సినిమాకు క‌మిట్ అయిపోయిన‌ట్టు నిర్ణ‌యానికి రాకండ‌ని పూజా హెగ్డే చెబుతోంది. ఈ ఏడాది మాత్రం క‌చ్చితంగా త‌మిళ సినిమా చేస్తాన‌ని మాత్రం క్లారిటీ ఇచ్చేసింది.