అన్నయ్య హీరోయిన్లంటే తమ్ముడికి ఎందుకంత ఇష్టం


Pooja Hegde
అన్నయ్య హీరోయిన్లంటే తమ్ముడికి ఎందుకంత ఇష్టం

అక్కినేని అఖిల్ నటిస్తున్న నాలుగో చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎంతో మంది హీరోయిన్స్ ను పరిశీలించిన తర్వాత మొత్తానికి పూజ హెగ్డేను కథానాయికగా ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ పై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పూజ హెగ్డేను తీసుకునే ముందు అఖిల్, పూజకు టెస్ట్ షూట్ కూడా చేసారు.

అన్నీ ఓకే అనుకున్న తర్వాత పూజను తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశమొకటి ఉంది. నాగ చైతన్యతో సవ్యసాచిలో నటించిన నిధి అగర్వాల్ , అఖిల్ తో మజ్ను సినిమాలో నటించింది. అలాగే ఇప్పుడు పూజ హెగ్డే కూడా నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమాలో కనిపించింది. ఇలా అన్నయ్యతో చేసిన హీరోయిన్లతో తమ్ముడు సినిమాలు చేయడం ఆసక్తికరంగా మారింది.

Credit: Twitter