నిఖార్సైన హిట్ ఒక్కటి లేదు కానీ రేటు 2 కోట్లు


Pooja Hedge
నిఖార్సైన హిట్ ఒక్కటి లేదు కానీ రేటు 2 కోట్లు

ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లోని బిజీ స్టార్స్ లో ఒకరు. ఈ ఏడాది మహర్షి సినిమాతో హిట్ కొట్టిన పూజ, రీసెంట్ గా హిట్టైన గద్దలకొండ గణేష్ చిత్రంలో చిన్న పాత్రైనా కూడా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం పూజ హెగ్డే సినిమాలకంటే ఆమె పారితోషికం ఎక్కువ హైలైట్ అవుతోంది. ప్రస్తుతం పూజ హెగ్డే ఒక సినిమాకు కోటిన్నర నుండి 2 కోట్ల దాకా డిమాండ్ చేస్తోంది. సరిగ్గా గమనిస్తే ఈ భామ కెరీర్ లో నిఖార్సైన హిట్ ఒక్కటి కూడా లేదు. ఇటీవలే హిట్ అయిన సినిమాలు అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్ చిత్రాలలో ఆమె పాత్రలకు అంత ప్రాధాన్యం లేదు.

ఈ పారితోషికం చాలా ఎక్కువైనా నిర్మాతలకు కూడా వేరే ఆప్షన్ ఉన్నట్లు అనిపించట్లేదు. కాజల్, తమన్నా, రకుల్ వంటి వారు సీనియర్ హీరోలకు ఫిక్స్ అయిపోయారు. సమంత చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పూజ హెగ్డే లాంటి వారు తమకున్న డిమాండ్ ను ఫుల్లుగా వాడుకుంటున్నారు. అదీ సంగతి.