పూజకు అడ్డుగా నిలుస్తోన్న ఆ హీరోయిన్ ఎవరు?Pooja Hegde faces competition from rashmika mandanna
Pooja Hegde faces competition from rashmika mandanna

మొదట్లో రెండు ప్లాపులు అందుకున్నా కానీ డీజే సినిమాతో పూజ హెగ్డే తన కెరీర్ ను కీలక మలుపు తిప్పుకుంది. అక్కడి నుండి వరసగా సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ పూజ హెగ్డే టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలోనే టాప్ రేంజ్ కు చేరుకుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కాకుండా అమ్మడి డేట్స్ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. డిమాండ్ కు తగ్గట్లుగానే ఒక్కో సినిమాకూ దాదాపు రెండున్నర కోట్లు తీసుకుంటూ పూజ ఎవరికీ అందనంత ఎత్తులో తన కెరీర్ ను ముందుకు తీసుకెళుతోంది.

ప్రస్తుతం పూజ దగ్గరలో రష్మిక మందన్న తప్ప వేరే ఏ హీరోయిన్ లేరంటే అతిశయోక్తి కాదు. రష్మిక మందన్న కూడా వరస విజయాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది రెండు సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్పలో నటిస్తోంది. సినిమాకు దాదాపు కోటిన్నర రూపాయల పారితోషికం తీసుకుంటోంది.

మరి ఈ ఇద్దరిలో ఎవరిదీ పైచేయి అవుతుందో చూడాలి.