లాక్‌డౌన్ పూర్త‌యిన వెంట‌నే ఆ ప‌నిచేస్తుంద‌ట‌!లాక్‌డౌన్ పూర్త‌యిన వెంట‌నే ఆ ప‌నిచేస్తుంద‌ట‌!
లాక్‌డౌన్ పూర్త‌యిన వెంట‌నే ఆ ప‌నిచేస్తుంద‌ట‌!

చైనాలోని పూహాన్ ఓ పుట్టిన క‌రోనా వైర‌స్ ప్రంచాన్ని ఒక్క‌సారిగా భ‌యాణ‌క వాతావ‌ర‌ణంలోకి నెట్టేసింది. యావ‌త్ ప్ర‌పంచం మొత్తం ఇంటి నుంచి బ‌ట‌య అడుగు పెట్టాలంటే వ‌ణికిపోతోంది. సామాన్యుడి నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి. దీంతో లాక్ డౌన్ అనివార్యం అని భావించిన కేంద్రం ముందు జ‌న‌తా క‌ర్ఫ్యూని, ఆ త‌రువాత 21 రోజుల పాటు లాక్ డౌన్‌ని అమ‌ల్లోకి తీసుకొచ్చింది.

తాజాగా దీన్ని మే 3 వ‌ర‌కు పొడిగించారు. తెలంగాణ‌లో మే 7 వ‌ర‌కు కొన‌సాగిస్తారు. 8న లాక్ డౌన్ ఎత్తేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే ప్ర‌భాస్ సినిమా `జాన్‌` కోసం జార్జియా వెళ్లిన పూజా హెగ్డే కీల‌క ఘ‌ట్టాల‌ని విప‌త్క‌ర స‌మ‌యంలో పూర్తి చేసుకుని తిరిగి ఇండియా వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. హీరో ప్ర‌భాస్‌తో పాటు యువీ టీమ్ అంతా హైద‌రాబాద్ వ‌చ్చేసి క్వారెంటీన్‌కే ప‌రిమితం అయిపోతే పూజా హెగ్డే ముంబై వెళ్లిపోయింది. నక్క‌డే త‌న ఇంటిలో స్వీయ నిర్భంధాన్ని పాటిస్తోంది.

నిర్భంధం మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఫిట్ నెస్ వీడియోలు, విచిత్ర మైన టీ ష‌ర్ట్ వీడియోలు, వంట‌ల‌కు సంబంధించిన వీడియోస్‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాల‌క్షేపం చేస్తోంది. అయితే వ‌న్స్ లాక్ డౌన్ ఎత్తేస్తే వెంట‌నే రెక్క‌లు క‌ట్టుకుని హైద‌రాబాద్‌లో వాలిపోతుంద‌ట‌. నిత్యం షూటింగ్‌ల‌తో బిజీగా గ‌డిపేసిన పూజాకు ప్ర‌స్తుతం బోర్ కొడుతోంద‌ట‌. ఆ డేస్‌ని మిస్స‌వుతోంద‌ట‌. అందుకే లాక్‌డౌన్ ఎత్తేయ‌డ‌మే ఆల‌స్యం హైద‌రాబాద్ వ‌చ్చేస్తాన‌ని చెబుతోంది.