పూజాహేగ్డేకే జై కొట్టేలా వున్నాడే!


పూజాహేగ్డేకే జై కొట్టేలా వున్నాడే!
పూజాహేగ్డేకే జై కొట్టేలా వున్నాడే!

`గ‌బ్బ‌ర్‌సింగ్‌`.. 2012లో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కు వ‌రుస ఫ్లాపుల్లో వున్న ప‌వన్ కెరీర్‌కి కొత్త జ‌వ‌స‌త్వాల‌ని అందించి అత‌ని కెరీర్‌లోనే తిరుగులేని హిట్‌గా నిలిచింది. ప‌వ‌న్‌ని ఈ సినిమాలో హారీష్‌శంక‌ర్ కొత్త పంథాలో ప్ర‌జెంట్ చేసిన తీరు న‌చ్చ‌డంతో సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించింది. మ‌ళ్లీ దాదాపు తొమ్మిదేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్ – హ‌రీష్‌శంక‌ర్ క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారు.

మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌లో తెర‌పైకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా న్యూస్ ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో చ‌క్కర్లు కొడుతోంది. త్వ‌ర‌లో సెట్స్‌పైకి రామోతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శృతిహాస‌న్ న‌టించ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంటే హారీష్‌శంర్ మాత్రం త‌న ఫేవ‌రేట్ హీరోయిన్ పూజా హెగ్డేని ఈ సినిమాకు ఫైన‌ల్ చేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా వున్నాయ‌ని తెలుస్తోంది.

హ‌రీష్‌శంక‌ర్ రూపొందించిన డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌లో పూజా హెగ్డేనే మెయిన్ హీరోయిన్‌. కావాల‌నే ఆ సినిమాల్లో పూజాని హీరోయిన్‌గా తీసుకున్న హ‌రీష్‌శంక‌ర్ త‌న తాజా క్రేజీ సినిమాలో తీసుకోకుండా వుంటారా అన్న‌ది తాజా వాద‌న‌. దీంతో అంద‌రి చూపు శృతి కంటే పూజా హెగ్డే వైపే మ‌ళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని హ‌రీష్‌శంక‌ర్ స్వ‌యంగా వెల్ల‌డిస్తారా? లేదా అన్న‌ది వేచి చూడాల్సిందే.