ప‌వ‌న్‌కు జోడీగా హీరోయిన్ ఫిక్స్‌?ప‌వ‌ర్‌కు జోడీగా హీరోయిన్ ఫిక్స్‌?
ప‌వ‌ర్‌కు జోడీగా హీరోయిన్ ఫిక్స్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ యాక్ష‌న్ మోడ్‌లోకి వ‌చ్చేశారు. బాలీవుడ్ లో సంచ‌ల‌న విజయాన్ని సాధించిన `పింక్‌` ఆధారంగా తెర‌కెక్కుతున్న ఓ చిత్రాన్ని ముందుగా అంగీక‌రించారు. `వ‌కీల్‌సాబ్‌`పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. వేణు శ్రీ‌రామ్ తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమా క‌రోనా క్రైసిస్ కార‌ణంగా మేలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని కూడా మొద‌లుపెట్టిన ప‌వ‌ర్‌స్టార్ త్వ‌ర‌లో హ‌రీష్ శంక‌ర్ చిత్రాన్ని కూడా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది.

ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా లావ‌ణ్య త్రిపాఠి న‌టించ‌నుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే న‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. హ‌రీష్ శంక‌ర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా పూజా హెగ్డే విషెస్ తెలియ‌జేసింది. దానికి బ‌దులుగా సోష‌ల్ మీడియాలో `మ‌నం త్వ‌ర‌లో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాం` అని హ‌రీష్ శంక‌ర్ ట్వీట్ చేయ‌డంతో ప‌వన్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవ‌ర‌నే దానికి క్లారిటీ ఇచ్చిన‌ట్ట‌యింది.