రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన పూజ హెగ్డే

రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన పూజ హెగ్డే
రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన పూజ హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ నటిగా చలామణి అవుతోంది పూజా హెగ్డే. దీపం  ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెత పాతదే అయినా పూజ హెగ్డేకు సరిగ్గా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పూజ హెగ్డే తనకున్న డిమాండ్ ను పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది.

పూజ హెగ్డే అల వైకుంఠపురములో సినిమా తర్వాత టాప్ గేర్ వేసింది. ఆమెకు వరసగా భారీ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధే శ్యామ్, అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్, విజయ్ తో బీస్ట్ సినిమాకు కమిట్ అయింది పూజ హెగ్డే. వీటికి తోడు హిందీ చిత్రాలు ఉండనే ఉన్నాయి.

తెలుగులో అమ్మడికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. తనకున్న డిమాండ్ దృష్ట్యా తన పారితోషికాన్ని 3 కోట్ల రూపాయలకు పెంచేసింది ఈ భామ. అయినా కూడా నిర్మాతలు ఆ భారీ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధమవుతుండడం విశేషం.