పూజా హెగ్డే.. హిట్టు పడిందా అరవిందా?


Pooja Hegde
Pooja Hegde

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే బ్యూటీ పూజా హెగ్డే. ఎప్పుడైతే డిజే సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుందో అప్పటి నుంచి అమ్మడి క్రేజ్ మరింత పెరుగుతూ వస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ బాక్స్ బిగ్ ఆఫర్స్ ని దక్కించుకుంటోంది. అరవింద సమేత అనంతరం ఆ డోస్ మరింత పెరిగింది.

ఇక బాలీవుడ్ లో కూడా బేబీకి ఎంతో కొంత అవకాశాల సంఖ్య పెరిగేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమ్మడు నటించిన హౌజ్ ఫుల్ 4 సాలీడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రివ్యూలు గట్టిగా దెబ్బ కొట్టినప్పటికి మూడు రోజుల్లోనే 50కోట్లను వసూలు చేసి 2019 బెస్ట్ ఓపెనర్స్ లిస్ట్ లో ఒకటిగా నిలిచింది. అక్షయ్ కుమార్ – రితేష్ దేశ్ ముఖ్ వంటి స్టార్ హీరోలు నటించిన ఆ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో కామెడీ బాగాలేదని మొదటిరోజే క్రిటిక్స్ పెదవి విరిచారు.
కానీ ఫెస్టివల్ సీజన్ లో ఆడియెన్స్ రివ్యూలను పెద్దగా పట్టించుకోకుండా సినిమాకు వెళ్లారు. ఫస్ట్ వీకెండ్ లొనే సినిమా 50కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేయడంతో నిర్మాతల్లో ఆశలు బలపడ్డాయి. ఇక పూజ హెగ్డే ఆశలకు హద్దే లేకుండా పోయాయి. గతంలో హృతిక్ రోషన్ లాంటి హీరోతో మెహేంజోదరో అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. ఇక ఇన్నాళ్లకు హౌజ్ ఫుల్ 4తో  పాజిటివ్ కలెక్షన్స్ రావడంతో బాలీవుడ్ లో అవకాశాలు దక్కుతాయని ఆశపడుతోంది. మరి అమ్మడి రేంజ్ ఎక్కడివరకు వెళుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.