హాసిని లాంటి పాత్రలో పూజPooja Hegde
Pooja Hegde

“బొమ్మరిల్లు” సినిమాని మరచిపోలేము, అందులో చేసిన “హాసిని” క్యారక్టర్ ని కూడా మరచిపోలేము. “జెనీలియా” గారు అంతలా మనల్ని మర్చిపోలేని పాత్రలో ఎంటెర్టైన్మెంట్న్ చేశారు, కారణం దర్శకుడు “భాస్కర్”. అతని ఇంటి పేరు కూడా “బొమ్మరిల్లు భాస్కర్” అయ్యింది.

ఇక “అఖిల్” తన నాలుగవ సినిమా భాస్కర్ గారితో చేస్తున్నారు అని మనకి తెలిసిందే కదా, షూటింగ్ కూడా షర వేగంతో జరుపుకుంటున్న ఈ సినిమాలో మన “పూజ హెగ్డే” కూడా జాయిన్ అయ్యారు. ఇక పూజ హెగ్డే గారి రోల్ అయితే ఇంతవరకు బయటికి రాలేదు కానీ, మాకు ఇంకొక హాసిని లాంటి పాత్రలో మాకు ఎంటర్టైన్మెంట్ కావలి అని అటు పూజ ఫ్యాన్స్, ఇటు భాస్కర్ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు.

అఖిల్ విషయానికి వస్తే, 3 సినిమాల మీద భారీగా ఆశలు పెట్టుకున్న “అక్కినేని” అభిమానులు ఈ సారి ఎలాగైనా మాకు హిట్ వస్తుంది అని అఖిల్ మీద, దర్శకుడు మీద కూడా బాగా అంచనాలు ఉన్నాయి. ఇక మన పూజ హెగ్డే గారు కూడా జిన్ అయ్యారు కాబట్టి అంచనాల నడుమ సినిమా బాగా హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంద్దాం.