పూజ హెగ్డే ఐరన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్…

Pooja Hegde
పూజ హెగ్డే ఐరన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్…

నటిగా అరంగేట్రం చేసిన ఏ భాషలోనూ పూజ హెగ్డేకు పెద్దగా కలిసిరాలేదు. తమిళంలో చేసిన మాస్క్ అట్టర్ ప్లాప్ అయింది. తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద ప్లాపులుగా మిగిలాయి. హిందీలో చేసిన మొహెంజదారో ఎంత పెద్ద డిజాస్టరో అందరికీ తెల్సిందే. వెళ్లిన ప్రతీ భాషలో చేసిన మొదటి సినిమా ప్లాపులుగా మారడంతో ఆమెకు ఐరన్ లెగ్ ముద్ర వేసేసారు జనాలు.

అయితే ఇండస్ట్రీ మాత్రం ఆమెను పక్కన పెట్టలేకపోయింది. స్టార్ హీరోయిన్ ఫీచర్లు ఉండటం, కొంచెం పొడుగ్గా ఉండడంతో పొడుగు హీరోల పక్కన సరిగ్గా సెట్ అయ్యేది. అయితే తెలుగులో రీఎంట్రీ చిత్రం దువ్వాడ జగన్నాథం కూడా కమర్షియల్ గా పెద్ద ఆడేసిందేంలేదు. అయితే తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. గద్దలకొండ గణేష్ చిత్రంలో చేసింది చిన్న రోల్ అయినా కోటి పారితోషికం అందుకుంది.

వెంటనే అల్లు అర్జున్, మహేష్ బాబు చిత్రాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ రెండూ హిట్ అనిపించుకున్నాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్, ప్రభాస్ ల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ కామెడీ సిరీస్ హౌస్ ఫుల్ 4 చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలు హిట్ అయితే అమ్మడి రేంజ్ కి ఆకాశమే హద్దు. ఐరన్ లెగ్ అన్నవాళ్ళే గోల్డెన్ లెగ్ అంటారు.