క్వారెంటైన్ వేళ హాట్ సెల్ఫీల హంగామా!


క్వారెంటైన్ వేళ హాట్ సెల్ఫీల హంగామా!
క్వారెంటైన్ వేళ హాట్ సెల్ఫీల హంగామా!

లాక్‌డౌన్ వేళ సినీ తార‌లు చేసే చిత్రాలు చూడ‌లంటే రెండు క‌ళ్లు చాల‌డం లేద‌ట నెటిజ‌న్స్‌కి. క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లో వుంది. దీని కార‌ణంగా ఎవ‌రూ బ‌య‌టికి రాకూడ‌ని ప‌రిస్థితి. దీంతో స్టార్స్ అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. అయినా ఏ ఒక్క‌రూ ఖాలీగా లేరు. ఖాలీగా వుండ‌టం లేదు.

ముఖ్యంగా హీరోయిన్లు మాత్రం హాట్ యోగాల‌తో ఇంట‌ర్నెట్‌ని హీటెక్కించేస్తున్నారు. యోగా వ‌ర్క‌వుట్‌లంటూ, ఫిట్ నెస్ మంత్రం అంటూ వైరైటీ ఆస‌నాల‌తో పిచ్చెక్కించేస్తున్నారు. ప్ర‌భాస్ సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లి వ‌చ్చిన పూజా హేగ్డే అప్ప‌టి నుంచి క్వారెంటైన్‌కే ప‌రిమిత‌మైపోయింది. అప్ప‌టి నుంచి ఒక్కో రోజు ఒక్కో వీడియో, ఒక్కో ఫొటోని షేర్ చేస్తోంది.

తాజాగా పూజా హెగ్డే సోష‌ల్ మీడియా లో షేర్ చేసిన సెల్ఫీలు నెటిజ‌న్స్ అవాక్క‌య్యేలా వున్నాయి. మిర్ర‌ర్ ముందు నుంచుని పూజా హెగ్డే తీసుకున్న సెల్పీలు వైర‌ల్ అవుతున్నాయి. క్వారెంటైన‌ర్ వేళ హాట్ సెల్పీల హంగామా ఏంటీ బాబోయ్ అంటున్నారు నెటిజ‌న్స్.

 

View this post on Instagram

 

A 1..a 2….a 123 gooo… ?#strikeapose #quarantinemademedoit

A post shared by Pooja Hegde (@hegdepooja) on

Credit: Instagram