`బంగార్రాజు`కి హీరోయిన్ దొరికిందోచ్‌!


Pooja Hegde ready to romance with Nagarjuna
Pooja Hegde ready to romance with Nagarjuna

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున న‌టించిన `సోగ్గాడే చిన్నినాయ‌నా ` అనూహ్య విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో హీరోగా నాగార్జున 50 కోట్ల క్ల‌బ్‌లో చేరారు. థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా నాగ్ కొత్త జోన‌ర్‌లో న‌టించిన ఈ సినిమాకి సీక్వెల్ చేయాల‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. దీనికి `బంగార్రాజు` అని టైటిల్‌ని కూడా ఖ‌రారు చేశారు కూడా. స్క్రిప్ట్ అనుకున్న స్థాయిలో రాక‌పోవ‌డంతో చాలా రోజులుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు.

ఫైన‌ల్ స్క్రిప్ట్ ని తాజాగా లాక్ చేశారు. తాతా మ‌న‌వ‌ళ్ల క‌థ‌గా దీన్ని తెర‌పైకి తీసుకురాబోతున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. తాత‌గా నాగార్జున, మ‌న‌వ‌డిగా నాగ‌చైత‌న్య న‌టిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనితో పాటు బ‌య‌టికి వినిపిస్తున్న దానికి మించి  క‌థ కొత్త పంథాలో సాగుతుంద‌ని కూడా చెబుతున్నారు.

నాగ‌చైత‌న్య‌కు జోడీగా ఇందులో స‌మంత న‌టిస్తుండ‌గా, నాగార్జున జోడీ కోసం గ‌త కొన్ని రోజులుగా అన్వేషించి ప‌లువురి పేర్ల‌ని ప‌రిశీలించిన ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్‌కృష్ణ వ‌రుస స‌క్సెస్‌ల‌తో జోరుమీదున్న పూజా హెగ్డేని ఫైన‌ల్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. పూజా కూడా నాగ్‌తో క‌లిసి న‌టించ‌డానికి సుముఖ‌త‌ను వ్య‌క్తం చేస్తుండ‌టంతో ఎంపిక ఇక లాంఛ‌న‌మే అన్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా వున్న చిత్ర బృందం త్వ‌ర‌లోనే `బంగార్రాజు`ని ప‌ట్టాలెక్కించ‌బోతున్న‌ట్టు తెలిసింది.