స్టార్ హీరోని కాద‌న్న బుట్ట‌బొమ్మ‌?


Pooja Hegde rejects sthar hero film
Pooja Hegde rejects sthar hero film

తెలుగులో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే క్రేజ్ మామూలుగా లేదు. స‌క్సెస్‌, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా పూజా హెగ్డేకి వ‌ర‌స అఫ‌ర్లు లభిస్తున్నాయి. అయితే ఓ టాప్ హీరో చిత్రంలో న‌టించే ఆఫ‌ర్ వ‌స్తే మ‌రో ఆలోచ‌న లేకుండా తిరస్క‌రించ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేస్తోంది. గ‌త రెండేళ్లుగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చిన స్టార్ హీరో తాజాగా వ‌రుస ప్రాజెక్ట్‌ల‌ని ప్ర‌క‌టిస్తూ షాకుల మీద షాకులిస్తున్నారు. ఇటీవ‌ల ఓ బ‌యోపిక్‌ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు స‌ద‌రు స్టార్ హీరోతో పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రం కోసం పూజా హెగ్డేకి భారీ ఆఫ‌ర్ ఇచ్చినా ఆమె న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపించ‌లేద‌ట‌. అదే స‌మ‌యంలో వ‌చ్చిన బాలీవుడ్ ఆఫ‌ర్‌ని మాత్రం వెంట‌నే అంగీక‌రించడం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. స‌ల్మాన్‌ఖాన్ హీరోగా హిందీలో భారీ చిత్రం తెర‌పైకి రాబోతోంది. ఇలాంటి అవ‌కాశం కోస‌మే ఎదురుచూస్తున్న పూజా హెగ్డే మ‌రో ఆలోచ‌న లేకుండా తెలుగు స్టార్ హీరో చిత్రాన్ని తిర‌స్క‌రించి స‌ల్మాన్ చిత్రానికి జైకొట్టేసింద‌ట‌.

పూజా హెగ్డే ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా రూపొందుతున్న పిరియాడిక్ ఫిల్మ్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రాధాకృష్ణ‌కుమార్ రూపొందిస్తున్న ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ ని వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌బోతున్నారు. స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.