ప్ర‌భాస్ హీరోయిన్ వింత స‌మాధానం!


ప్ర‌భాస్ హీరోయిన్ వింత స‌మాధానం!
ప్ర‌భాస్ హీరోయిన్ వింత స‌మాధానం!

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వైర‌స్ క‌రోనా. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఎక్క‌డ చూసిన మ‌ర‌ణాలే. ప్ర‌పంచ నలుమూల‌ల‌కు విస్త‌రించింది. ఏ దేశం చూసిన క‌రోనా లెక్క‌లే చెబుతోంది. లెక్క‌కు మించి మ‌ర‌ణాలు. మొద‌టి ప్ర‌పంచ యుద్ధాన్ని మించి ఘోర క‌లి తాండ‌విస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న అన్ని దేశాల్లో మ‌ర‌ణాలు ఆగ‌డం లేదు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఏం చేయాలి? . ప్ర‌జ‌ల్ని ఎలా ర‌క్షించాలి? అని ప్ర‌భుత్వ యంత్రాంగాలు భ‌యంతో వ‌ణికిపోతున్నాయి.

ప్ర‌పంచాన్ని దీని బారి నుంచి బ‌య‌ట‌ప‌డేయాలంటే ఒక్క‌టే దారి అదే సోష‌ల్ డిస్టెన్సీ.. లాక్ డౌన్‌. 21 రోజుల పాటు లాక్ డౌన్‌ని కేంద్రం ప్క‌టిచింది. దీంతో అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. ప్ర‌భాస్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకుని వ‌చ్చాక ఇంటికే ప‌రిమిత‌మైపోయింది. అయితే ఖాలీగా వుండ‌టం ఎందుకు అనుకుందో ఏమో సోష‌ల్ మీడియాలో కొత్తగా అభిమానుల‌తో ఇంట‌రాక్ట్ కావ‌డం మొద‌లుపెట్టింది.

#AskPooja అనే హ్యాష్ ట్యాగ్‌తో అభిమానుల‌తో ఇంట‌రాక్ట్ కావ‌డం మొద‌లుపెట్టింది. న‌న్ను అడ‌గండి అంటే నెటిజ‌న్స్ ఊరుకుంటారా? ప‌్ర‌శ్న‌ల‌తో పిచ్చెక్కించెయ్య‌రూ.. అదే చేశారు. కానీ పూజా హెగ్డే మామూలుది కాదుగా అంతే స్పీడుతో వారికి స‌మాధానాలు చెప్ప‌డం మొద‌లుపెట్టింది. ఓ నెటిజ‌న్ `లాక్ డౌన్ వేళ మీ రోటీన్ దిన‌చ‌ర్య ఏంట‌ని అడిగితే మాత్రం వింత స‌మాధానం చెప్పింది. ఏముంది తిన‌డం..ప‌డుకోవ‌డం.. చూడ‌టం.. అంటూ స‌మాధానం చెప్పేస‌రికి నెటిజ‌న్‌కు దిమ్మ‌దిరిగిపోయింది.