తమ్మూ కాదు.. మహేష్ కోసం మహర్షి భామ


Mahesh Babu
తమ్మూ కాదు.. మహేష్ కోసం మహర్షి భామ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతున్నా దర్శకుడు అనిల్ రావిపూడి ప్రధాన బలం కామెడీ మీదనే ఫోకస్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఖలేజా టైమ్ లో మహేష్ కామెడీ తరహాలో అనిల్ ఈ చిత్రంలో మహేష్ ను వాడుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ గురించి రోజుకోరకమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ముందు మహేష్ కు బాగా కలిసొచ్చిన మీనాక్షి దీక్షిత్ ను మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ భామ సోషల్ మీడియాలో తనని ఎవరూ సంప్రదించలేదని, ఒకవేళ అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని అంది. దాని తర్వాత తమన్నా ఈ సాంగ్ ను చేయబోతోందని అన్నారు. ప్రస్తుతం అది కూడా కాదని, ఈ పాట కోసం పూజ హెగ్డేను సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇదైనా నిజమేనా లేక ఒట్టి పుకారుగా మిగిలిపోనుందా?