సూపర్ హిట్ స్ట్రిక్ట్ భామ వద్ద బన్నీ ఎలా వేగుతాడో!


సూపర్ హిట్ స్ట్రిక్ట్ భామ వద్ద బన్నీ ఎలా వేగుతాడో!
సూపర్ హిట్ స్ట్రిక్ట్ భామ వద్ద బన్నీ ఎలా వేగుతాడో!

స్టైలిష్ అల్లు అర్జున్, అందాల భామ పూజ హెగ్డే కలిసి నటిస్తున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చకచకా సాగిపోతోంది. ఫ్రాన్స్ లో సూపర్ హిట్ సాంగ్ సామజవరగమన షూటింగ్ కోసం పారిస్ వెళ్లిన చిత్ర బృందం మరికొన్ని రోజుల్లో ఈ సాంగ్ షూట్ ను పూర్తి చేస్తారని తెలుస్తోంది. నవంబర్ చివరి నాటికి కానీ, డిసెంబర్ మొదటి వారానికి కానీ ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా త్రివిక్రమ్ అండ్ కో పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తామేదో ముందు ప్రమోషన్స్ చేసుకుంటే కొంచెం కలిసొస్తుంది అని భావిస్తే అది కాస్తా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్ర యూనిట్ ఆనందానికి అవధుల్లేవు. అల వైకుంఠపురములో నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. సమజవరగమన, రాములో రాముల పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ రెండు పాటలు కలిపి కేవలం యూట్యూబ్ నుండే 110 మిలియన్ కు పైగా వ్యూస్ రావడం నిజంగా గొప్ప విషయమే. సామజవరగమన పాటకైతే ఏకంగా 1 మిలియన్ లైక్స్ కు చేరువైంది. ఇదో ప్రత్యేకమైన రికార్డుగా చెప్పుకుంటున్నారు.

ఇది పక్కనపెడితే పూజ హెగ్డే అల వైకుంఠపురములో చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సినిమాలో తను స్ట్రిక్ట్ బాస్ గా కనిపిస్తానని, తను పెట్టే గోల్స్ విషయంలో కచ్చితంగా ఉంటానని అయితే కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి సాఫ్ట్ గా కూడా ఉంటానని చెప్పుకొచ్చింది. తన కింద ఎంప్లొయ్ గా అల్లు అర్జున్ కనిపిస్తాడని కూడా అంది ఈ భామ. సో స్ట్రిక్ట్ బాస్ దగ్గర బుక్కయిపోయే పాత్రలో బన్నీ కనిపించనున్నాడన్నమాట. ఇటీవలే విడుదల చేసిన లిరికల్ వీడియో, పోస్టర్స్ ప్రకారమైతే అదే ఆఫీస్ లో నవదీప్, కమెడియన్ రాహుల్ రామకృష్ణ కోసం కనిపిస్తున్నారు. అంటే సినిమాలో వీరందరూ కొలీగ్స్ అన్నమాట. ఈ సీన్లు చాలా ఫన్నీగా వచ్చినట్లు చిత్ర బృందం చెబుతోంది.

నవంబర్ లోనే అల వైకుంఠపురములో మూడో పాట విడుదల కానుందని సమాచారం. అలాగే చిత్ర టీజర్ ను డిసెంబర్ మొదటి వారంలో వదులుతారని ప్రచారం సాగుతోంది. మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7నే టీజర్ విడుదల చేద్దామని భావించినా, తక్కువ సమయంలో అతిగా ప్రమోషన్స్ చేసినట్లు అవుతుందని త్రివిక్రమ్ వారించాడు. అందుకే ఆ ప్రయత్నం మానుకుని, మలయాళం ప్రేక్షకుల కోసం సామజవరగమన మలయాళం సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటకు కూడా రెస్పాన్స్ బాగుంది. అల వైకుంఠపురములో కథ ప్రకారం అవ్వడానికి డబ్బున్న వాళ్ళ బిడ్డే అయినా జాతకంలో ఉన్న దోషం కారణంగా ఆ ఇంటి డ్రైవర్ ఇంట్లో పెరుగుతాడు అల్లు అర్జున్. స్వతహాగా డ్రైవర్ కొడుకైన సుశాంత్, అల్లు అర్జున్ ఇంట్లో పెరుగుతాడు. ఆ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో సినిమా ఉంటుందని టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే.