తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధమవుతోన్న పూజ హెగ్డే

తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధమవుతోన్న పూజ హెగ్డే
తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధమవుతోన్న పూజ హెగ్డే

తెలుగులో తక్కువ సమయంలోనే టాప్ రేంజ్ కు చేరుకుంది పూజ హెగ్డే. అల వైకుంఠపురములో సక్సెస్ ఆమె రేంజ్ ను మరింతగా పెంచింది. ప్రస్తుతం పూజ హెగ్డే మూడు తెలుగు సినిమాలు చేస్తోంది. అఖిల్ సరసన చేస్తోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు మిగిలాయి.

అలాగే ప్రభాస్ తో చేస్తోన్న రాధే శ్యామ్ విషయం కూడా అంతే. ఒక వారం రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇక ఆచార్యలో చిన్న పాత్ర చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రం కోసం ఒక సాంగ్ షూటింగ్ పూర్తి చేయాలి. ఇవి కాకుండా తెలుగులో మరే సినిమాలు సైన్ చేయలేదు. బాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోన్న పూజ హెగ్డే, తమిళ్ లో విజయ్ సరసన చిత్రాన్ని ఒప్పుకుంది.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం తెలుగులో మూడు చిత్రాలను పూర్తి చేసిన తర్వాత మళ్ళీ సినిమాలు సైన్ చేస్తుందిట. వేరే ఇండస్ట్రీలలో బిజీగా ఉన్నా సరే టాలీవుడ్ కే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పింది పూజ.