త్వరలోనే నెక్స్ట్ సెట్ సినిమాలు సైన్ చేయనున్న పూజ హెగ్డే

త్వరలోనే నెక్స్ట్ సెట్ సినిమాలు సైన్ చేయనున్న పూజ హెగ్డే
త్వరలోనే నెక్స్ట్ సెట్ సినిమాలు సైన్ చేయనున్న పూజ హెగ్డే

ఏ మాత్రం సందేహం లేకుండా పూజ హెగ్డే టాలీవుడ్ లో నెం 1 హీరోయిన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. వరసగా టాప్ సినిమాలు చేయడమే కాదు రెమ్యునరేషన్ పరంగానూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది ఈ భామ. అయినా కూడా నిర్మాతలు ఏ మాత్రం కంప్లైంట్ లేకుండా ఆమెను తీసుకుంటున్నారు.

రీసెంట్ గా తమిళ్ లో బీస్ట్ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. అలాగే రాధే శ్యామ్ షూటింగ్ ను కూడా త్వరలో పూర్తి చేస్తుంది. బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్స్ ఉండనే ఉన్నాయి. గత కొంత కాలం నుండి పూజ హెగ్డే మరికొన్ని సినిమాలు సైన్ చేసిందని చెబుతూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి.

మహేష్ చిత్రం, నితిన్ తో సినిమా అంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి కానీ పూజ ఇంకా కొత్త సినిమాలు సైన్ చేయలేదు. ఈ నెలాఖరుకు వాటిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.