సింగర్ గా మారుతున్న అల్లు అర్జున్ హీరోయిన్


 Pooja hegde turned as singer
Pooja hegde turned as singer

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన తాజాగా నటిస్తున్న పూజా హెగ్డే నటన మాత్రమే కాదు సింగర్ గా కూడా రాణించాలని తహతహలాడుతోంది . తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ముచ్చటగా మూడో చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది . ఇక ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు .

దాంతో తమన్ సంగీతం లో ఈ భామ కూని రాగాలు తీయడానికి గొంతు సవరించుకుంటోంది . పూజా హెగ్డే కు పాటలు పాడటం అంటే చాలా ఇష్టమట దాంతో ఈ చిత్రంలో ఓ పాట పాడాలని ఉందని తమన్ చెవిలో వేసిందట ! ఇంకేముంది తమన్ పూజా హెగ్డే ని సింగర్ గా మార్చడానికి తగు సలహాలు సూచనలు ఇస్తున్నాడట . దాంతో ఈ సినిమాలో ఓ పాట పాడటం ఖాయమని తెలుస్తోంది .