క‌మ‌ల్‌తో బంధంపై స్పందించింది!


క‌మ‌ల్‌తో బంధంపై స్పందించింది!
క‌మ‌ల్‌తో బంధంపై స్పందించింది!

క‌మ‌ల్‌హాస‌న్ `విశ్వ‌రూపం` ద‌గ్గ‌రి నుంచి వివాదాల్లో నిలుస్తున్నారు. డిజిట‌ల్ లో రిలీజ్ చేస్తానంటూ కొత్త సంప్ర‌దాయానికి తెర‌లేపితే థియేట‌ర్స్ సంఘాలూ క‌మ‌ల్‌హాస‌న్ చిత్రాల్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ కాకుండా నిషేధిస్తామంటూ నిర‌స‌న‌కు దిగ‌డం అప్ప‌ట్లో వివాదానికి దారితీసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ స‌న్నివేశంలో న‌టి పూజా కుమార్‌తో క‌లిసి ఘాటు స‌న్నివేశాల్లో న‌టించారు.

అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని, ఆ కార‌ణంగానే క‌మ‌ల్ త‌న త‌దుప‌రి చిత్రాల్లోనూ వ‌రుస‌గా పూజా కుమ‌యార్‌కు అవ‌కాశాలు ఇస్తూ వ‌స్తున్నార‌ని. ఇటీవ‌ల జ‌రిగిన క‌మ‌ల్ పుట్టిన రోజు వేడుక‌ల్లోనూ క‌మ‌ల్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పూజా కుమార్ కూడా పాల్గొన‌డం ఈ వాద‌న‌ల‌కు బ‌లాన్ని చేకూర్చిందంటూ ఇటీవ‌ల వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఓ త‌మిళ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌మ‌ల్‌తో త‌న అనుబంధంపై వ‌స్తున్నవార్త‌ల‌పై హీరోయిన్ పూజా కుమార్ స్పందించింది. `క‌మ‌ల్ సార్‌తో క‌లిసి గ‌త ఏదేళ్లుగా న‌టిస్తున్నాను. గొప్ప క్రియేట‌ర్ కూడా. ఆయ‌న నుంచి ఎలా ఓపిక‌గా వ్య‌వ‌హ‌రించాలో నేర్చుకుంటున్నాను. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో నాకు మంచి అనుబంధం వుంది. అలా అని ఏవేవో వార్త‌ల్ని పుట్టించ‌డం స‌రికాదు. క‌మ‌ల్‌కు నాకు మ‌ధ్య ఎలాంటి సంబంధం లేదు` అని స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.