మసాలా కోసం ఆమెని తీసుకున్నారట


pooja ramachandran in bigg boss 2బిగ్ బాస్ సూపర్ హిట్ అయ్యింది అయితే బిగ్ బాస్ 2 మాత్రం ఆ స్థాయిలో విజయం సాధించడం లేదు దాంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మసాలా ని అద్దడానికి ప్రయత్నాలు చేసారు బిగ్ బాస్ 2 నిర్వాహకులు . బిగ్ బాస్ 2 షోకి మసాలా అందించడానికి హాట్ భామ పూజా రామచంద్రన్ అనే భామని తీసుకొచ్చారు . పూజా రామచంద్రన్ తెలుగులో అలాగే తమిళ్ లో పలు చిత్రాల్లో నటించింది . నిఖిల్ తో కలిసి స్వామి రారా చిత్రంలో నటించిన పూజా రామచంద్రన్ కు ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో ఛాన్స్ వచ్చినప్పటికీ ఏవి కూడా అంతగా ఆడలేదు దాంతో ఇంకా బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంది ఈ భామ .

పూజా రామచంద్రన్ స్థానంలో హెబ్బా పటేల్ ని తీసుకోవాలని అనుకున్నారు కానీ రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతో చివరకు పూజా రామచంద్రన్ ని తీసుకున్నారు . ఈ భామ ఇక స్విమ్మింగ్ పూల్ లో దిగి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టడం ఖాయమని అంటున్నారు . నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 సక్సెస్ ఫుల్ గా నే నడుస్తోంది కానీ ఎన్టీఆర్ స్థాయిలో మొదటి సిరీస్ లా ఆకట్టుకోవడం లేదు . పూజా ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి బిగ్ బాస్ 2.

English Title: pooja ramachandran in bigg boss 2